Anand Mahindra gets dance lessons from Ram Charan on RRR’s Naatu Naatu, video goes viral
mictv telugu

నాటునాటు పాటకు ఆనంద్ మహీంద్ర- రామ్‎చరణ్ స్టెప్పులు… ఇద్దరు ఇరగదీశారు(వీడియో)

February 12, 2023

Anand Mahindra gets dance lessons from Ram Charan on RRR’s Naatu Naatu, video goes viral

హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా-ఈ మెయిన్ రేసు శనివారం ముగిసింది. పోటీలో ఫ్రాన్స్ కు చెందిన జీన్ ఎరిక్ వెర్నే (డీఎస్ పెన్స్ కే టీమ్) విజేతగా నిలిచాడు. భారత్ దేశంలోనే మొదటి సారి జరిగిన ఈ రేసు చూసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నగరానికి తరలివచ్చారు. సినీ స్టార్స్, క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీలను తిలకించారు.క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్, చాహల్‌లు పోటీలో సందడి చేశారు. టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్,కేజీఎఫ్ నటుడు యష్, దుల్కార్ సల్మాన్, తదితరులు వచ్చారు.

 

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. వారిద్దరు పక్కన కూర్చొని పోటీలను తిలకిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పోటీల్లో పాల్గొన్న మహీంద్ర టీమ్ యజమాని ఆనంద్ మహీంద్రాతో రామ్ చ‌ర‌ణ్‌ కలిసి సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ హిట్ సాంగ్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. రామ్ చరణ్ వన్, టూ, త్రీ చెబుతుండగా… ఆనంద్ మహీంద్రా ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‎లో పంచుకున్నారు.
” హైదరాబాద్ గ్రాండ్ ప్రీ సందర్భంగా తనకు నిజమైన బోనస్ లభించింది. నాటు నాటు పాటకు సంబంధించి బేసిక్ డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో రామ్ చరణ్ నుంచి నేర్చుకున్నాను. థాంక్యూ రామ్ చరణ్… మీ నాటు నాటు పాట ఆస్కార్ లో విజేతగా నిలవాలి” అని ట్వీట్ చేశారు. ఈ వీడియోపై రామ్ చరణ్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. “ఆనంద్ మహీంద్రా గారూ… ఈ స్టెప్పులను నాకంటే మీరే త్వరగా నేర్చుకున్నారు” అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‎లు వైరల్‎గా మారాయి