ఇడ్లీ బామ్మకు మహీంద్ర సాయం, ఆ ఖర్చంతా ఆయనదే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇడ్లీ బామ్మకు మహీంద్ర సాయం, ఆ ఖర్చంతా ఆయనదే..

September 12, 2019

ఒక రూపాయికే ఇడ్లీ ఇస్తూ పేదల ఆకలి తీర్చుతున్న బామ్మకు అండగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. కమలాత్తాళ్ చేస్తున్న సేవ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఆమె ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట బాధగా ఉంది వివరాలు నాకు తెలిపితే వంటగ్యాస్ ఇప్పిస్తానంటూ పేర్కొన్నారు.ఇది చూసిన మరుసటి రోజే  కోయంబత్తూర్‌కు చెందిన భారత్ గ్యాస్ విభాగం ఆమెకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మహీంద్రాకు ట్యాగ్ చేశారు. ఇది చూసిన ఆయన బామ్మకు సాయం చేసినందుకు వారిని ప్రశంసించారు. ఇక నుంచి ఆమెకు కావాల్సిన గ్యాస్‌కు ఆర్థిక సాయం తానే అందిస్తానంటూ చెప్పారు. 

కాగా తమిళనాడులోని పేరూరుకు చెందిన 80 ఏళ్ల కమలాత్తాళ్ కొన్నేళ్లుగా ఒక రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తోంది. ప్రతి రోజు కనీసం వెయ్యి ఇడ్లీలు కేవలం కట్టెల పొయ్యి ద్వారానే చేసి అమ్ముతుంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆనంద్ మహీంద్ర సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇన్నాళ్లు అనేక కష్టాలు పడుతూనే కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేసిన బామ్మ.. ఇకపై వంట గ్యాస్ ద్వారా ఇడ్లీలు చేయనుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆనంద్ మహీంద్రా గొప్ప మనసున్న వ్యక్తి అంటూ పొగిడేస్తున్నారు. దీంతోపాటు భారత్ గ్యాస్ అధికారులను కూడా మెచ్చుకున్నారు. మొత్తంమీద నలుగురి సాయం చేస్తున్న ఈ బామ్మకు ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త అండ దొరికింది.