అదానీల వ్యాపారాలపై హిండెన్ బర్గ్ ప్రవేశపెట్టిన నివేదిక మీద ఎంఅండ్ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఎన్ని సవాళ్ళు వచ్చిన భారత్ ధృడంగా నిలబడుతుంది అంటూ ట్విటర్ పోస్ట్ పెట్టారు. ఎన్ని సంక్షోభాలు, తుఫానులు వచ్చినా భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగానే ఉంటుందని ఆయన ప్రకటించారు.
గ్లోబల్ మీడియా చేస్తున్న ఊహాగానాలకు అర్ధం లేదని అంటున్నారు ఆనంద్ మహీంద్రా. ఇండియా ఇంతకు ముందు కూడా ఇలాంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొందని కానీ ప్రతీసారీ బలంగా నిలబడిందని ఆనంద్ అన్నారు. భూకంపాలు, కరువులు, మాంద్యాలు, యుద్ధాలు, ఉగ్రదాడులులాంటివి ఎన్నో చూశా…నేను చెప్పేది ఒక్కటే భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ సవాల్ చేయొద్దు అంటూ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
గ్రహాంతర వాసి అని చావగొట్టారు కానీ..
ఆనతి నీయరా హరా అంటూ వెళ్ళిపోయిన గాన’వాణి’