కదిలే డైనింగ్ టేబుల్.. రోడ్లమీదే తినేయవచ్చు.. భవిష్యత్‌ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కదిలే డైనింగ్ టేబుల్.. రోడ్లమీదే తినేయవచ్చు.. భవిష్యత్‌ వీడియో

July 5, 2022

కేవలం తినడానికి మాత్రమే కూర్చోవడం ఎందుకు సమయం బొక్క. ప్రయాణిస్తూ తింటే అటు సమయం ఆదా అవుతందని భావించే వారికి ఈ కదిలే డైనింగ్ టేబుల్ కరెక్టుగా సూట్ అవుతుంది. రోడ్డు మీద వెళ్తూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినవచ్చు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఇలాంటి యంత్రాల అవసరం ఉందంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఈ కదిలే డైనింగ్ టేబుల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారతీయుల జీవన శైలికి ఈ యంత్రం అవసరం లేనప్పటికీ భవిష్యత్తులో తప్పకుండా అవసరపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. నలుగురు వ్యక్తులు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని ఆహారం తింటూంటారు. ఆ టేబుల్‌కి మోటారు, ఇంజిను వంటివి ఉంటాయి. అలా తింటూ రోడ్డు మీద ప్రయాణిస్తుండగా, వాహనం లాంటి ఆ డైనింగ్ టేబుల్‌ని బంకు వద్ద ఆపి పెట్రోల్ కొట్టిస్తారు. తర్వాత ఆ టేబుల్ లాంటి వాహనం బయల్దేరుతుంది. ఫన్నీగా అనిపిస్తున్న ఈ వీడియోను నెటిజన్లు ఆశ్చర్యంతో చూస్తూ షేర్ చేస్తున్నారు.