సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు. చిన్నారి డ్యాన్స్‌కి ఏనుగు ఫిదా అయిన ఓ వీడియోను షేర్ చేసి కామెంట్ చేశారు. వీడియో ప్రకారం.. కర్ణాటకలోని కత్తిల్ ఏరియా శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఓ చిన్నారి నృత్యప్రదర్శన ఇచ్చింది. సాంప్రదాయ భంగిమలతో ఆ పాప చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌కి అక్కడే ఉన్న ఏనుగు పాపకు ఫ్యాన్ అయిపోయింది. ఏమాత్రం బెదురు లేకుండా తన ముందు డ్యాన్స్ చేస్తున్న పాప వంక తదేకంగా చూస్తూ తొండంతో పలుమార్లు ఆశీర్వదించింది. తర్వాత చిన్నారిని అనుకరించి తనదైన శైలిలో తల ఊపుతూ అనుకరించింది. దేవస్థానం ఏనుగు కాకవడంతో పాప కూడా ఏనుగు ఆశీర్వాదాన్ని సంతోషంగా స్వీకరిస్తూ అందుకు తగిన హావభావాలతో మరింత హుషారుగా ప్రదర్శన ఇచ్చింది. న్యూఇయర్ సందర్భంగా ఆనంద్ మహేంద్ర ఈ వీడియోను షేర్ చేసి ఆ ఏనుగు మనందరినీ నూతన సంవత్సరంగా ఆశీర్వదిస్తోందిన భావిస్తున్నానని ట్వీట్ చేశారు. దీంతో పాప డ్యాన్స్‌కి ఏనుగుతో పాటు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయ్యారని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Sri Durgaaparameshwari temple , Kateel, Karnataka.
Amazing. And I would like to think the Temple Elephant is bestowing a blessing on all of us for a Happier New Year! 😊 pic.twitter.com/s2xdqV8w5D— anand mahindra (@anandmahindra) December 31, 2022