జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను దుండగుడు తుపాకీతో కాల్చి హత్య చేసిన విషయం విదితమే. అయితే ఆ సమయంలో భద్రతా వైఫల్యం కూడా ఓ కారణమని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. హత్య వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనపై మండిపడ్డారు. దుండగుడు కాల్చిన మొదటి బుల్లెట్ మిస్ఫైర్ అయిందని, అప్పుడే సెక్యూరిటీ వాళ్లు ఆయనను కవర్ చేసి ఉంటే అబే బతికేవారని అభిప్రాయపడ్డారు. చూపులు చూస్తూ నిలబడ్డ పోలీసులు అప్రమత్తంగా లేరని విమర్శించారు. తర్వాత కాల్చిన రెండు బుల్లెట్లతో అబే కుప్పకూలిపోయారని వెల్లడించారు. జపాన్లో ఇలాంటి ఘటనలు అరుదైనా.. భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోందని వెల్లడించారు.
The first shot missed. There was a potentially life-saving gap until the second shot. Shouldn’t his security have jumped on Abe & flattened & covered him instead of chasing the assailant? He could have & should have survived this. pic.twitter.com/aGSI1SO3yA
— anand mahindra (@anandmahindra) July 9, 2022