ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా.. తన వ్యాపారం రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటారు. స్పూర్తినిచ్చే ప్రతీ అంశంపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఇలాంటి అంశంపైనే ట్వీట్ చేశారు. ‘‘ టెక్నాలజీపై ప్రకృతిదే విజయం’’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఆ వీడియో వైరల్ గా మారింది. పదివేల మంది ఈ వీడియోకు లైక్స్ కొట్టగా.. ఏకంగా 5 లక్షల వ్యూస్ వచ్చాయి.
Proof that the natural world will always triumph over technology… 😊👏🏽👏🏽👏🏽 pic.twitter.com/Ac1zKEgxdw
— anand mahindra (@anandmahindra) January 18, 2023
వీడియోలో ఓ ఓ సరస్సు వద్ద డ్రోన్ తో షూట్ చేస్తున్న సమయంలో ఓ చిన్న మొసలి దాన్ని తదేకంగా చూస్తూ ఉంటుంది. మొసలి ఫుటేజ్‌ను దగ్గరగా తీసేందుకు ప్రయత్నించగా.. ఆకాశంలో ఎగిరే పక్షి అనుకొని మొసలి కూడా నీళ్లలోనుంచి పైకి లేస్తుంది. ఇక ఫోటోగ్రాఫర్ భయపడి ఆ డ్రోన్ ను ఇంకాస్త పైకి గాల్లోకి లేపగా.. మొసలి అతడికి గట్టి షాక్ ఇచ్చింది. పై భాగాన ఉన్న డ్రోన్ ను.. మొసలి గోల్ కీపర్ లా పైకెగిరి దాన్ని నోట కరుచుకొని ఆ వెంటనే నీటిలోకి వెళ్లి పోతుంది. థ్రిల్లర్ మూవీని తలపించే రీతిలో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నాచురల్ వరల్డ్ ఎల్లప్పుడు టెక్నాలజీపై ఆధిక్యతను ప్రదర్శిస్తుందనే దానికి ఇదే ఉదాహరణ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. నిజమే సార్ అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేయాగా.. మరొకరు ఇది మహీంద్రా థార్ కన్నా స్పీడ్ గా ఉన్న డ్రోన్ మొసలి నుంచి తప్పించుకోలేకపోయిందని, మొసలికి కొత్త డ్రోన్ వచ్చిందంటూ మరో నెటిజన్ ఫన్నీగా రిఫ్లై ఇచ్చాడు.