బ్యాంకు ఉద్యోగి ముందు జాగ్రత్త చూస్తే షాక్ తింటారు (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకు ఉద్యోగి ముందు జాగ్రత్త చూస్తే షాక్ తింటారు (వీడియో) 

April 4, 2020

కరోనా వైరస్ కరెన్సీతో కూడా వ్యాప్తి చెందుతోందని చైనాలో పాతనోట్లను రోడ్లమీద వృధాగా పారేసి.. కొత్త నోట్లను ముద్రించారు. అలాగే ఇటలీలో కూడా అదే పరిస్థితి నెెలకొంది. రోడ్డు మీద చిత్తుకాగితాల మాదిరి కరెన్సీ పడిఉంది. అయినా ఎవ్వరూ వాటిని ముట్టుకునే సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు అప్రమత్తం అవుతున్నట్టే ఉన్నారు. ఓ బ్యాంకు ఉద్యోగి అనుసరించిన పద్థతి, చెక్ తీసుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. వాట్సాప్ వండర్ బాక్స్‌లో వచ్చిన వీడియోను షేర్ చేస్తూ ఈ టెక్నిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ, క్యాషియర్ సృజనాత్మకతను మాత్రం మెచ్చుకోవాల్సిందేనని ఆయన స్టేటస్ పెట్టారు.

ఆ వీడియోలో బ్యాంకు ఉద్యోగి ఏంచేశాడంటే.. చేతికి గ్లౌజులు, నోటికి మాస్క్ వేసుకుని తన క్యాబిన్‌లో కూర్చున్నాడు. అప్పుడే ఓ వినియోగదారుడు వచ్చాడు. అతని నుంచి, చెక్కును ప్లకర్‌తో అందుకుని, దానిని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఐరన్ బాక్స్‌తో ఇస్త్రీ చేసి మరీ తీసుకున్నాడు. ఇస్త్రీ వేడికి కరోనా చచ్చిపోతుందని ఆయన ఆ జాగ్రత్త పాటించాడు. అయితే ఇలా చేయడం వల్ల కరోనాను అడ్డుకునేందుకు ఎంతవరకు పనికి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. కాగా, కరోనా కరెన్సీ నుంచే కాకుండా వార్తా పత్రికలు, పాల ప్యాకెట్లతో కూడా వ్యాపిస్తుంది అని వైద్యులు అంటున్న విషయం తెలిసిందే. ముందు ముందు వారు ఎలాంటి జగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.