వీడు మామూలోడు కాదు.. మీరే చూడండి.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

వీడు మామూలోడు కాదు.. మీరే చూడండి.. (వీడియో)

May 18, 2019

కొందరు పిల్లలు చేసే పనులు తెప్పిస్తే.. మరికొందరు చేసే పనులు, అద్భుతంతోపాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా మహింద్రా కంపెనీ యజమాని ఆనంద్ మహింద్రా కూడా ఓ పిల్లాడు చేసిన విన్యాసాలు చూసి షాక్‌కు గురయ్యారు.అంతే కాదు వావ్ అంటూ.. ఆశ్చర్యంతో కూడాని ఆనందం వ్యక్తం చేశారు.

‘ఫుట్ బాల్‌తో అనేక విన్యాసాలు చేస్తున్నఈ చిన్నారి జుట్టుని చూసి మొదట అమ్మాయి అనుకున్నాను. కానీ అబ్బాయి అని తెలిసింది.’ అని పేర్కొన్నారు. నాలుగేళ్ల ఈ ఇరానీయన్ కుర్రాడి విన్యాసాలు అద్భుతం అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మైదానంలో ప్రత్యర్థి అంచనాలకు అందకుండా.. ఈ బుడ్డోడు చేసిన గోల్స్ చేసిన తీరు.. మైదానంలో బంతిని కాలితో తిప్పిన తీరు.. చూసి ఎవ్వరైనా అవాక్కవాల్సిందే.. చూడకుండా బాస్కెట్‌లో బంతిని వేయడం, నెట్స్‌లో చురుకైన సాధన అతని ప్రతిభకు నిదర్శనం. ఈ బుడ్డోడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు బుడ్డోడు పెద్ద ఫుట్ బాల్ ప్లేయర్ అవుతాడంటూ.. బుడ్డొడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు