Anand Mahindra Tweet Gone Viral : simple innovative techniques for folding clothes
mictv telugu

Anand Mahindra Tweet : ఆమె మడత పెడితే..వీడియో వైరల్

March 4, 2023

Anand Mahindra Tweet Gone Viral : simple innovative techniques for folding clothes

ఒకప్పుడు బట్టలు ఉతకడం అనేది మహిళకు పెద్ద పని. ఇంట్లో ఉన్నవారందరి బట్టలు ఉతికేసరికి ఒళ్లు హూనమైపోయేది. కానీ వాషింగ్ మెషిన్ ఆ కష్టాన్ని దూరం చేసింది. బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు వాష్ చేయడం దగ్గరి నుంచి డ్రై చేసే వరకు అంతా అదే చేసేస్తోంది. బట్టలు ఉతికే పనిని సులువు చేసేసింది. ఎన్ని యంత్ర పరికరాలు అందుబటులో ఉన్నా కొన్ని పనులను మాత్రం మనుషులే చేయాలి. అందులో ఒకటి బట్టలు మడతబెట్టడం. ఉతికిన బట్టలను మడతబెట్టే ఓపిక లేక చాలా మంది మహిళలు ఇష్టానుసారంగా వాటిని ఫోల్డ్ చేస్తుంటారు. టూర్స్ కు వెళ్లేప్పుడు బ్యాగులో బట్టలు సర్దడం రాక చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. ఇష్టానుసారంగా బ్యాగులో బట్టలను కుక్కుతుంటారు. అలాంటి వారికోసం స్మార్ట్ ఐడియాను అందిస్తోంది ఓ మహిళ. బట్టలు ఫోల్డ్ చేయడం కూడా ఒక ఆర్ట్ అని ట్విట్టర్ లో వీడియోను షేర్ చేసి నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అందరిని అమితంగా ఆకట్టుకుంటోంది.

ఈ మహిళ బట్టలు మడతబెట్టే స్టైల్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంత అందంగా బట్టలను ఫోల్డ్ చేయవచ్చా అని నెటిజన్లు అవాక్కవుతున్నారు. బట్టలు సూట్ కేస్ లలో, బ్యాగుల్లో బట్టలు సరిపోయేలా అతి చిన్నగా అందంగా బట్టలను ఎలా ఫోల్డ్ చేయాలో ఈ వీడియాలో చక్కగా చూపించింది. షర్ట్స్ దగ్గరి నుంచి ప్యాంట్‏ల వరకు అన్నింటిని చూడముచ్చటగా బ్యాగుల్లో సరిపోయే విధంగా ఆమెకున్న నైపుణ్యతతో ఫోల్డ్ చేసింది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈమె పనితనానికి ఫిదా అయ్యారు. తన ట్విట్టర్ లోనూ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోతో పాటు ఎప్పుడూ చేసే పనులను సింపుల్ టెక్నిక్స్ తో ఎంతో అద్భుతంగా చేస్తోంది. ఏళ్లుగా ప్రపంచమంతా తిరిగే నాకు ఈ ప్యాకింగ్ వీడియో ముందే ఎందుకు కనిపించలేదు అని కామెంట్ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోకు మరింత క్రేజ్ లభించింది.