సోషల్ మీడియా వాడుతున్న చాలామందిలో ఆనంద్ మహీంద్రా గురించి తెలియని వారుండరు. ఆయన వ్యాపార పరంగా ఎంత బిజీగా ఉన్నా… సోషల్ మీడియాల చాలా యాక్టివ్‌గా ఉంటారు. నచ్చిన ప్రతి విషయాన్ని ఆయన అందులో షేర్ చేస్తూ నెటిజన్లకు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఆయన షేర్ చేసే ప్రతి ఫోటో, వీడియో లో ఏదో ఒక సందేశాత్మక విషయాన్ని తెలియజేడయానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఓ స్ట్రీట్ వెండార్ కి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఆ వ్యక్తి తనకు అతిథిగా రావాలంటూ ఆయన ట్వీట్ చేయడం విశేషం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఓసారి చూద్దాం..
రోడ్ సైడ్ స్వీట్ కార్న్(స్ట్రీట్ బిజినెస్) అమ్ముతున్న ఓ వ్యక్తి అందరిలా కాకుండా.. తాను చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ సంతృప్తిని పొందుతున్నాడు. అతను ఎక్కడివాడో తెలియదు. హోటల్ లో ఫుడ్ తయారు చేసి అమ్ముతూ అందులో భాగంగా తనకు ఇష్టమైన మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫుడ్ తయారుచేసేటప్పుడు తన దగ్గరున్న గిన్నెలు, గరిట మొదలైన వాటితోనే మ్యూజిక్ క్రియేట్ చేసిన ఈ వ్యక్తిలో ట్యాలెంట్ చాలా ఉందని అర్థమైపోతుంది.
Thanks https://t.co/vEoZMOwsTU
— anand mahindra (@anandmahindra) February 12, 2023
అతని టాలెంట్ కి ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయాడు. “ఈ జెంటిల్‌మెన్ ఎక్కడ పనిచేస్తారో నాకు తెలియదు, కానీ బెంగుళూరులో జరగబోయే మా మహీంద్రా పెర్కషన్ ఫెస్టివల్(#MahindraPercussionFestival)కి గౌరవనీయ అతిథిగా రావాలి. తనకు నచ్చిన సంగీతంతో తన పనిని ఆస్వాదిస్తున్న ఇతను తృప్తిగా జీవించడంలో సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాడు” అని ఆదివారం చేసిన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇది కాస్త వైరల్‌గా మారి.. ఆ వ్యక్తి తమిళనాడు చెన్నైలోని బ్రూక్‌ఫీల్డ్స్ మాల్‌లో పనిచేస్తున్న వ్యక్తిగా తెలిసింది. ఇదే విషయాన్ని ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రాకు రిట్వీట్ చేశారు. కాగా బెంగళూరులో మార్చి 18న మహీంద్రా పర్కుషన్ ఫెస్టివల్ (సంగీతం) కార్యక్రమం జరగనుంది.