Anand Mahindra's Pledge After Details Emerge On Cyrus Mistry's Car Accident
mictv telugu

సైరస్‌ మిస్త్రీ ప్రమాద ఘటన.. ఆనంద్‌ మహీంద్రా కీలక నిర్ణయం

September 5, 2022

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54)తో పాటు జహంగీర్‌ పండోల్‌ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌ నుంచి ముంబయి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న కారు పాల్‌ఘర్‌ జిల్లాలోని సూర్య నదిపై ఉన్న వంతెన వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

 

మితిమీరిన వేగంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వీరి కారు కేవలం 9 నిమిషాల్లోనే 20 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఆ సమయంలో వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తేలింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. కారు వెనుక సీట్లో కూర్చున్నా సరే సీట్ బెల్టు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. మీరందరూ కూడా వెనుక సీట్లో ఉన్నప్పుడు కూడా సీటు బెల్టు పెట్టుకుంటామనే ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పారు. మన కుటుంబాలకు మనం ఎంతో రుణపడి ఉన్నామని… మనం ప్రాణాలతో ఉండటం మన కుటుంబాలకు చాలా అవసరమని అన్నారు.