Anand Mohan family photo viral
mictv telugu

జీవిత ఖైదీ దర్జాగా భార్యతో ఇంట్లోనే.. బీహార్‌లో దుమారం

August 16, 2022

Anand Mohan family photo viral

కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఆర్జేడీ నేత జైల్లో కాకుండా భార్యాపిల్లలతో ఇంట్లో కనిపించడం బీహార్‌లో సంచలనంగా మారింది. అటు అనుచరులతో మీటింగ్ పెట్టడం ఆ ఫోటోలు బయటకి రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ అందుకు బాధ్యులైన ఆరుగురు పోలీస్ సిబ్బందిపై వేటు వేసి సమగ్ర దర్యాప్తుకు చర్యలు ప్రారంభించింది.

పూర్తి వివరాల్లోకెళితే.. ఆనంద్ మోహన్ అనే రాజకీయవేత్తకు తుపాకులు, కత్తులతో ఫోజులిచ్చే నేరస్థుడిగా పేరుంది. 1994లో కలెక్టర్ కృష్ణయ్యను దారుణంగా హత్య చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మోహన్‌ను పాట్నా కోర్టులో హాజరుపరిచిన సిబ్బంది తర్వాత జైల్లో కాకుండా నేరుగా ఇంటికే తీసుకెళ్లారు. అక్కడ భార్య, కొడుకు, అనుచరులతో గ్రూపు ఫోటో దిగాడు. తర్వాత సరదాగా పార్టీలో పాల్గొన్నాడు. అయితే రెండ్రోజుల తర్వాత ఫోటోలు బయటికి రావడంతో రాజకీయ దుమారం రేగింది. మళ్లీ జంగిల్ రాజ్యం వచ్చిందంటూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అటు మోహన్ కుమారుడు ప్రస్తుతం చేతన్ ఆనంద్ ఎమ్మెల్యేగా ఉండడంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారని మండిపడింది.