కరోనా పేషంట్‌ను రోడ్డుపై పారేసిన 108 - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పేషంట్‌ను రోడ్డుపై పారేసిన 108

August 1, 2020

Anantapur coroan patient

‘కరోనా వైరస్ తో పోరాడదాం, కరోనా పేషంట్‌తో కాదు’ అని సాక్షాత్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి  నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్నా కొంతమంది వైద్యసిబ్బంది మాత్రం చెవిన పెట్టుకోవడం లేదు. కరోనాతో చనిపోయిన వారినే కాకుండా కరోనా పేషంట్ల పట్ల కూడా అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలోలో వైద్యసిబ్బంది కరోనా బాధితుణ్నినడిరోడ్డుపై పారేసి వెళ్లిపోయారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. 

బాధితుడు గోపినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మడకశిర మండలం గుండుమల పంచాయతీ పీఎస్ తాండాకు చెందిన అతడు కరోనాతో పక్షం రోజుల కిందట సర్కారీ ఆస్పత్రిలో చేరాడు. ‘చికిత్స’ చేస్తున్నా కోలుకోకపోవడంతో సిబ్బంది అతణ్ని అర్ధరాత్రి అంబులెన్స్‌లో ఆస్పత్రి నుంచి బయటికి తీసుకొచ్చి108 వాహనంలో ఎక్కించుకుని రోడ్డుపైన పడేసి పోయారు. స్థానికులు అతణ్ని విషయం తెలుసుకుని అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు చేసేదేమీ లేదని అతణ్ని ఇంటికి తీసుకెళ్లారు. ఏపీలోనే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ నెగిటివ్ ఫలితం రాకముందే పెద్దసంఖ్యలో డిశ్చార్జి చేస్తున్నారు. దీని వల్ల పేషంట్ల నుంచి ఆరోగ్యంగా ఉండే కుటుంబసభ్యులకూ వైరస్ సోకుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.