Anantapur Electric Shock Incident
mictv telugu

విద్యుత్ షాక్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం

November 2, 2022

అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుత్ తీగలు పడి నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది.వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం తరుపున రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు.

విద్యుత్ శాఖ ద్వారా రూ.5 లక్షలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా మరో రూ.5 లక్షలు చొప్పున మొత్తం 10 లక్షలు అందజేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రమదాఘటనపై చర్యలు చేపట్టిన ప్రభుత్వం సంబంధిత అధికారులపై వేటు వేసింది. సబ్ డివిజన్ ఏడీఈ, ఏఈఈ, లైన్ ఇన్‌స్పెక్టర్ , లైన్‌మెన్‌లను సస్పెన్షన్ చేసింది.