ప్రియుణ్నిపెళ్లాడి విమానమెక్కిన కూతురు.. అవమానంతో రైలు కిందపడిన తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుణ్నిపెళ్లాడి విమానమెక్కిన కూతురు.. అవమానంతో రైలు కిందపడిన తండ్రి

October 20, 2018

ప్రేమ వివాహాలు హత్యలకే కాకుండా ఆత్మహత్యలకూ దారి తీస్తున్నాయి. సున్నిత మనస్కులైన తల్లిదండ్రులు తమ పిల్లలు పరువు తీశారంటూ ప్రాణాలు వదిలేస్తున్నారు. కూతురు తాము కాదన్న యువకుణ్ని పెళ్లిచేసుకోవడాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు, ఆమె భర్త అటు విమానం ఎక్కగా మరోవైపు తండ్రి ఇలా తనువు చాలించడం కలకలం రేపింది.

tt

అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారి భరత్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రూపాలికి విజయవాడకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిపించారు. రెండో కూతురు సోనాలి నిన్న సిద్ధార్థ రాయ్ అనే యువకుడిని రహస్యంగా పెళ్లి చేసుకుని విమానంలో బెంగళూరుకు వెళ్లిపోయింది. తన కోసం ఎక్కడా వెతకకూడదని తండ్రికి ఫోన్లో మెసేజ్ పెట్టింది. కూతురు కుటుంబ పరువు తీసిందన్న మనస్తాపంతో భరత్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అనంపురం దగ్గర్లోని గార్లదిన్నె రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.