Anasuya Bharadwaj has quits 'Jabardasth’, New Anchor replaces her position
mictv telugu

జబర్ధస్త్‌కు కొత్త యాంకర్.. అనసూయ స్థానంలో మంజూష?

July 31, 2022

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ కామెడీ షో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళుతుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాను జబర్దస్త్ నుంచి బయటకు రాబోతున్నట్లుగా గత నెల రోజుల నుంచే హిట్స్ ఇస్తూ వస్తోంది అనసూయ. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసింది.


దీంతో అనసూయ స్థానంలో జబర్దస్త్‌కు కొత్త యాంకర్ రాబోతోందని తెలిసింది. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. కొత్త యాంకర్ ను పల్లకిలో తీసుకొస్తూ జబర్దస్త్ కి స్వాగతం చెబుతున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. అయితే ఆమె ఎవరనేది మాత్రం తెలియనివ్వకుండా ఆమె ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరై ఉంటారబ్బా అనే అనుమానం మొదలైంది. ఆగస్టు 4 వరకు ఈ సస్పెన్సు ఇలాగే కొనసాగుతుంది. అయితే జబర్దస్త్ కొత్త యాంకర్ గా మంజూషను తీసుకున్నారనే టాక్ అయితే బయటకొచ్చింది. కాగా ఈ ఎపిసోడ్ కి కార్తికేయ 2 మూవీ టీమ్ నిఖిల్,శ్రీనివాసరెడ్డి, దర్శకుడు చందూ మొండేటి రావడం విశేషం.