ప్రపంచమంతా ప్రేమికుల రోజు జరుపుకుంటున్న సందర్భంగా యాంకర్ అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో సరదాగా పోస్ట్ చేసింది. దాంతో పాటు ‘నీతో జీవితం చాలా క్రేజీ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని చూసిన ఓ ఫాలోవర్ హద్దు మీరి కామెంట్ చేశాడు. ‘అదేం లేదక్కా. వాడి దగ్గర చాలా డబ్బుంది అందుకే’ అని కామెంట్ చేయడంతో అనసూయ మండిపడింది. కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది.
‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? నా దగ్గర లేదా డబ్బు. అయినా ఆయన డబ్బు నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబు. అయినా బావ గారిని వాడు వీడు అనొచ్చా. ఇదేం పెంపకం నీది. చెంపలేసుకో లేదంటే నేను వేస్తా చెప్పులతోటి చెంపలమీద’ దీనికి సదరు నెటిజన్ ‘మీరు నిజాన్ని అర్ధం చేసుకొని అంగీకరించాలి. మీరు ఎంత చెప్పినా రియాలిటీ రియాలిటీనే’ అని మరింత రెచ్చగొట్టాడు. దీనికి కాసేపాగాక అనసూయ ఓ రేంజ్‌లో ఆగ్రహం ప్రదర్శించింది. ‘నీ బొందరా నీ బొంద. మాట్లాడ్డం నేర్చుకో ఫస్ట్.
అంతర్యామిలా అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా. పస్కలొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. నీ బుద్ధి మనీ ఒకటే అయితే అందరిదీ అదే అని అనిపిస్తుంటుంది. వీలైతే మారు. గెట్ వెల్ సూన్. తమ్ముడివి కదా మంచీ చెడు చెప్తున్నా. ఏమనుకోకయ్యా’ అంటూ నీతులు చెప్పడానికి ప్రయ్నతించింది. కానీ ఆ నెటిజన్ మరింత రెచ్చిపోయాడు. ‘నీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు.
కావాలంటే నువ్వు నీ రెజ్యూమ్ పంపు పని మనిషిగా పెట్టుకుంటా’ అని రచ్చ లేపాడు. దీనికి అనసూయ మరింత హర్ట్ అయింది. ‘నా ఇన్‌స్టాలో నేను ఫోటో పెట్టుకుంటే నీకెందుకురా. అయినా నచ్చకపోతే నన్ను ఫాలో అవడం ఎందుకు. ఇక్కడి నుంచి దొబ్బేయ్’ అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. అతను వరుసగా కామెంట్లు చేస్తూనే ఉన్నా అనసూయ మాత్రం ఇచ్చింది సరిపోతుందిలే అనుకొని సైలెంట్ అయిపోయింది.