హృదయ మూత్రపిండం.. నోరు జారిన ట్రంప్  - MicTv.in - Telugu News
mictv telugu

హృదయ మూత్రపిండం.. నోరు జారిన ట్రంప్ 

July 11, 2019

తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఏకైక వ్యక్తి ఎవరంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరి చెప్పొచ్చు. ఒక్కోసారి ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి కామెడీ అయిపోతుంటాయి. అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు అన్నమాటే గానీ, ఆయన ఏం మాట్లాడతాడో తెలియకుండా వుంటుంది. మొన్న ఓ సమావేశంలో ట్రంప్ సౌదీ యువరాజును ఆటపట్టించారు. కుర్చీలో కూర్చున్న మహ్మద్ బిన్ సల్మాన్‌ను వెనకనుంచి తట్టి ఎవరో చెప్పుకో చూద్దాం అనే తరహాలో నవ్వులు పూయించారు. దాని గురించి సోషల్ మీడియాలో జోకులు పేలుతుండగా ట్రంప్ మరో వ్యాఖ్యతో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నారు.

 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. అమెరికా వ్యాప్తంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటిస్తూ, కిడ్నీకి హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని.. నిజంగా అదో అద్భుతం అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య చేయడంలో ఆయన ఉద్దేశం వేరే వుందని.. కిడ్నీ ప్రాధాన్యతను చెప్పే క్రమంలో ట్రంప్ అలా పేర్కొన్నారని ట్రోల్ చేస్తున్న యూజర్లకు కొందరు యూజర్లు సమాధానాలిస్తున్నారు. సంపూర్ణేశ్ బాబు ‘హృదయ కాలేయం’ సినిమా తరహాలో ట్రంప్ ‘హృదయ మూత్రపిండం’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.