ప్రముఖ టీవీ యాంకర్ అనసూయకు కోపమొచ్చింది. స్టూడియోల్లో గంటల తరబడి కెమెరాల ముందు హల్చల్ చేసే ఆమె ఓ బాలుడు ఎంతో అభిమానంతో ఫొటో తీయడానికి యత్నించగా నిప్పులు తొక్కేసింది. ఆ ఫోన్‌ను గుంజుకుని నేలకేసి పగలగొట్టింది. అతణ్ని, అతని తల్లిని పచ్చిబూతులు తిడుతూ కార్లో వెళ్లిపోయింది. దీంతో బాధితులు అనసూయపై కేసు పెట్టారు.
సికింద్రాబాద్ తార్నాకలోని విజయపురి కాలనతో ఈ ఉదంతం జరిగింది. తాము స్కూలుకు వెళ్తుండగా అనసూయ కనపించిందని, తన కుమారుడు ఆమెను ఫోటో తీయబోయగా ఆమె దారుణంగా ప్రవర్తించిందని తల్లి ఆరోపించింది. ‘ఫోన్ గుంజకుని విసిరికొట్టింది. గలీజ్ గలీజ్‌గా తిట్టుకుంట రుబాబు చేస్తూ పోయింది.. ’ అని చెప్పింది.