anchor anasuya another post badly trolled again in social media
mictv telugu

అనసూయ పక్కనున్న ఈ వ్యక్తి ఎవరు.. కొత్త వివాదంలో స్టార్ యాంకర్

October 28, 2022

యాంకర్ అనసూయకి సోషల్ మీడియాకి అవినాభావ సంబంధం ఉంటుంది. వరుస ప్రాజెక్ట్స్ తో అటు బుల్లితెర, ఇటు వెండితెరలలో అదరగొడుతున్న అనసూయ నిత్య వివాదాల్లోను నానుతూ ఉంటుంది. తాజాగా అనసూయ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఒక వ్యక్తితో సెల్ఫీ దిగి.. ‘నేను జెర్రీ అయితే ఇతను టామ్’, నా బెస్ట్ ఫ్రెండ్, సంరక్షుడు, హ్యాపీ బర్త్ డే.. అంటూ పోస్ట్ ఒకటి పెట్టింది అనసూయ. అమెరికాలో దిగిన ఈ సెల్ఫీ పోస్టుపై నెటిజన్స్ అసభ్యంగా ట్రోల్స్ చేయటం.. అనసూయ ఫాన్స్ తిప్పికొట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్న ఆమె.. దీపావళిని కూడా అక్కడే జరుపుకుంది. ఆ తరువాత అనసూయ ఈ పోస్టు పెట్టింది. అయితే నిత్యం అనసూయని ఏదొక రకంగా ఇబ్బందులు పెట్టె కొందరు నెగిటీవ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇతను నా సంరక్షుడు అని చెప్పనా.. సెల్ఫీలో కాస్త క్లోజ్ గా కనిపించడాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి అనసూయకి సన్నిహితంగా ఉన్నట్లుగా పేర్కొంటూ కొందరు కథలు అల్లేసే ప్రయత్నం చేయటం గమనార్హం.

అయితే అనసూయ ఫాన్స్ ఈ యాంటీ ట్రోల్స్ పై మండి పడుతున్నారు. అతనొక యాక్టర్ అని.. అడవి శేష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా 2013లో అమెరికాలో తీసిన ‘కిస్’ అనే మూవీలో నటించాడని.. ఇతని పేరు ఉజ్వల్ అని.. ఆ సినిమా విడుదల కాకపోవటంతో ఉజ్వల్ అమెరికాలోనే ఉండిపోయాడని.. అనసూయ అమెరికా టూర్ కి వెళ్ళినప్పుడు అతన్ని కలిసి ఫోటో తీసుకుని పోస్ట్ చేస్తే ఇంత అసభ్యంగా పోస్టులు పెట్టడం ఏంటని విమర్శిస్తున్నారు. అనసూయ తన స్నేహితుడిని పరిచయం చేయటం కూడా తప్పేనా? అంటూ ఆరా తీసిన వారిపై పలువురు మండిపడుతున్నారు. తప్పు చేసే వారు విషయాన్ని గుట్టుగా ఉంచాలనుకుంటారు. కానీ అనసూయ బహిరంగంగా పోస్టు పెట్టింది అని సమర్థిస్తున్నారు అనసూయ ఫాన్స్. ఏదేమైనా తన ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కావటం ఖాయమని మరోసారి రుజువు చేసింది స్టార్ యాంకర్ అనసూయ.