జోగు రామన్నకు అనుసూయ క్షమాపణ  - MicTv.in - Telugu News
mictv telugu

జోగు రామన్నకు అనుసూయ క్షమాపణ 

September 12, 2019

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టాలీవుడ్ దర్శకులు, తారలతోపాటు పలువురు సెలబ్రిటీలు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ కూడా ఈ కోవలో చేరిపోయారు. నల్లమలను నాశనం చేస్తే అక్కడ గడ్డికూడా మొలవదని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రి ఈ విషయాన్ని గుర్తించాలంటూ ఎమ్మెల్యే జోగు రామన్నను ఆమె ట్వీట్‌లో ట్యాగు చేశారు. అసలే మంత్రి పదవి దక్కక ఆవేదనలో ఉన్న రామన్న ప్రస్తుత పరిస్థితి తెలీక పొరపడ్డారు. తర్వాత నాలుక కరచుకుని క్షమాపణ కోరారు. 

అనసూయ ట్వీట్ ఇదీ.. 

‘ఇప్పుడే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకున్నా. యురేనియం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కావాలంట. సో, నేచురల్‌గా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపి.. ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కునే వాళ్లకే పీల్చడానికి గాలి లేకపోతే ఊపిరి ఆడక చావు.. అంతేగా??. ఇదేగా మన ఫ్యూచర్?? ఎలా అలో సార్ ఇదంతా?? ఆలోచించడానికే భయం వేయలేదా?’’ ట్వీట్ చేశారు. ఇందులో జోగు రామన్నను ట్యాగు చేశారు. ఆయన గత కేబినెట్లో అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేయడంతో ఇప్పుడు కూడా ఆ శాఖ మంత్రిగానే ఉన్నారని యాంకర్ పొరపడ్డారు. తర్వాత విషయం తెలుసుకుని ఆయనను క్షమాపణ కోరారు. 

టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తరవాత జోగు రామన్నకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన రెండో మంత్రివర్గ విస్తరణలో జోగు రామన్నకు స్థానం దక్కలేదు. ఆయన స్థానంలో ఇంద్రకరణ్ రెడ్డి పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అనసూయ.. జోగు రామన్నకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘పొరపాటుగా జోగు రామన్న సర్‌కు ట్యాగ్ చేసినందుకు క్షమాపణలు. వర్తమాన వ్యవహారాలపై అవగాహనలేమితో క్షమాపణ చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను ఇంద్రకరణ్ రెడ్డిగాని ఉద్దేశించి ట్యాగ్ చేశాను.. ’ అని ప్రస్తుత అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ట్యాగు చేశారు.