anchor anasuya bold answer to trolls
mictv telugu

డబ్బు కోసం ఏదంటే అది చేయను.. చెత్త ప్రశ్నలకు స్ట్రాంగ్ ఆన్సర్స్

December 6, 2022

జబర్దస్త్‌కి హోస్ట్‌గా అనసూయ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. కొన్ని సంవత్సరాలు జబర్దస్త్ స్టేజిని తన హోస్టింగ్ తో హీటెక్కించింది. అనసూయ చిలిపి హావభావాలకి ఆడియన్స్ క్రేజీ అయిపోయారు. అనసూయ ఈ షో ద్వారా సూపర్‌ స్టార్‌డమ్‌కి ఎదిగి ప్రస్తుతం వరుస చిత్రాలతో అదర గొడుతుంది. అయితే దురదృష్టవశాత్తు జబర్దస్త్ నుండి యాంకర్ అనసూయ తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం అనసూయ టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ప్రస్తుతం తన కిట్టిలో అనేక ప్రాజెక్ట్‌ లని పెట్టుకున్న అనసూయ ఎంత బిజిగున్నా ఆన్‌లైన్‌లో తన అభిమానులతో ముచ్చటించటం మాత్రం మరిచిపోదు. మొహమాటం లేకుండా తనపై వచ్చే నెగిటీవ్ ట్రోల్స్ కి సమాధనం ఇస్తుంటుంది. హద్దులు దాటితే చివాట్లు కూడా పెడుతుంది. మరీ శృతి మించితే అరెస్టులు కూడా చేపిస్తుంది. మొన్న తనని ఆంటీ అంటూ ఇషమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేయించింది అనసూయ. దాంతో కొద్దిరోజులు నుండి అనుపై ట్రోల్స్ కాస్త తగ్గుముఖం పట్టాయి.

ఈ సందర్భంగా మళ్ళీ తన అభిమానులతో ముచ్చటించింది అనసూయ. ఆన్ లైన్ ఇంటరాక్షన్ లో భాగంగా చాలా ప్రశ్నలకు తనదైన ఆన్సర్స్ ఇచ్చింది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కదా అని ఓ నెటిజన్ అనసూయని అడగ్గా.. తాను డబ్బు కోసం మాత్రం ఏదిపడితే అది చేయను. రెమ్యునరేష్ కోసం సినిమాలు మాత్రం అస్సలు ఒప్పుకోను. జనాలను ఎంటర్ టైన్ చేసేందుకు నటిస్తాను అని చెప్పింది. కొన్నిసార్లు పాత్ర నచ్చకపోయినా సరే.. ఫేవరెట్ హీరో ఉన్నారనే ఉద్దేశంతో సినిమాలు చేస్తుంటానని అనసూయ చెప్పుకొచ్చింది. రీసెంట్ గా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి గురించి ఓ నెటిజన్ అడిగాడు. ఇన్విస్టిగేషన్ జరుగుతుంది. ఇంతా స్పీడ్ గా జరుగుతుందో పక్కనపెడితే విచారణ మాత్రం కొనసాగుతుంది. మన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ఎదుటి వాళ్లను కించపరచడం, అగౌరవపరచడం తప్పు. ఇది చట్టరీత్యా నేరం అనేది కచ్చితంగా అమల్లోకి రావాలి. తీసుకురావాలి. ఇనాళ్లు చాలా ఓపికతో నచ్చజెప్పాను. ఇప్పుడు ఇక యాక్షనే’ అని అనసూయ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.