యాంకర్ అనసూయ ఇలా అనేసిందేంటి ..? నెటిజన్ల ట్రోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

యాంకర్ అనసూయ ఇలా అనేసిందేంటి ..? నెటిజన్ల ట్రోలింగ్

March 8, 2022

నేడు మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ సమాజంలో మహిళ పాత్రను, కుటంబం కోసం చేసే త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కానీ యాంకర్ అనసూయ దానికి భిన్నంగా స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘హఠాత్తుగా ఈ రోజు ప్రతీ ఒక్కరూ మహిళలను గౌరవించడం మొదలుపెట్టారు. మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజులోనే ముగిసిపోతుంది.

 

ఆ తర్వాత అంతా మామూలే. దీనికి మహిళలు దూరంగా ఉండడం బెటర్. హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ ట్వీటింది. దీనికి నెటిజన్లు కూడా గట్టిగానే జవాబిస్తున్నారు. అందరు పురుషులు ఒకేలా ఉండరు అని ఒకరు, నిజమే, నీలాంటి వాళ్లు ఎందరో మోసం చేస్తే మేమిలా తయారయ్యామని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.