Anchor Anasuya warned that the police will file a case
mictv telugu

మీలాంటి పనీపాట లేనోళ్లకి బుద్ది చెప్పే టైం వచ్చింది : అనసూయ

September 9, 2022

యాంకర్, నటి అనసూయ మరోసారి ట్విట్టర్‌లో రచ్చకు తెరలేపింది. ఇటీవల ఆంటీ అంటే పోలీసు కేసు పెడతానని చెప్పడంతో పలువురు నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రోల్ చేసే వాళ్ల పని చెప్తారు అంటూ తాజాగా ట్వీట్ చేయగా ఓ నెటిజన్ ఇలా రిప్లై ఇచ్చాడు. ‘నీలాగా మాకు పనీపాట లేదా అంటూ పోలీసులు పంపించేశారంటగా’ అని కామెంట్ చేశాడు. దీనికి అనసూయ కౌంటర్ ఇస్తూ ‘లేదండీ.. మీలా పనీపాటా లేని వారికి బుద్ధి చెప్పే టైమ్ వచ్చిందని చెప్పారండి. మీకు నోరు జారడంలో ఎంత తొందరో బోల్తాపడడానికి కూడా అంతే తొందర కదా. కాస్త ఓపిక పట్టండి. అన్నీ జరుగుతాయి, జరుగుతున్నాయి’ అని బదులిచ్చింది. దీంతో అనసూయ టాపిక్ మళ్లీ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే ఈ రచ్చ అంతా అనసూయనే మొదలుపెట్టిందని, ఇప్పుడు వేరే వాళ్ల మీదకు తోస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, ఈ విషయంపై పోలీసులు మాత్రం ఎలాంటి స్పందన బయటికి వ్యక్తం చేయలేదు.