anchor Anasuya Warning to Netizens
mictv telugu

ఆంటీ అంటే కేసు పెట్టి చుక్కలు చూపిస్తా… అనసూయ వార్నింగ్

August 26, 2022

“అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా” అంటూ నటి అనసూయ చేసిన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఓ హీరో అభిమానులు ఆమె మీద బూతులతో రెచ్చిపోతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ తనను ఎవరైతే అసభ్యంగా దూషిస్తున్నారో అవన్నీ మీ హీరోకే బదిలీ చేస్తున్నానంటూ అమె ట్వీట్ చేశారు.


ఇక ఆ తరువాత ఏమనుకుందో ఏమో కానీ ఈ రోజు ఛీ ఛీ అసలు ఎంత చెత్త బాబోయ్, క్లీన్ చేసి చేసి విసుగొస్తుంది అంటూ తాను చేసిన ట్వీట్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి ఆమె కామెంట్ చేసింది. తర్వాత తాను తనను ఆంటీ అని ఏజ్ షేమింగ్ చేస్తున్న వారిని, అలాగే తనను దూషిస్తున్న వారి ప్రతి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నానని , వారి మీద పోలీస్ కేసు పెడతానని ఆమె పేర్కొన్నారు. అది ఎక్కడ వరకు వెళుతుంది అంటే ఎందుకు నన్ను ఇలా మాట్లాడానా అని వాళ్ళు బాధపడే రేంజ్ కి తీసుకెళ్తానని ఆమె హెచ్చరించింది. ఇక నెటిజన్లు కూడా తగ్గేది లే అనుకుంటూ.. ఆంటీని ఆంటీ అనకుండా ఏ అమ్మాయి అంటారా ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు.