యాంకరింగ్‌తో పాటు తన అందంతో తెలుగునాట అభిమానులను సంపాదించుకున్న యాంకర్ అనసూయలో మరో కొత్త యాంగిల్ బయటపడింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులతో అభిమానులను అలరించే అనసూయ తాజాగా సాంప్రదాయబద్ధంగా చక్కటి చుడీదార్ వేసుకుంది.
అనంతరం భర్త కాళ్లకు మొక్కింది. ఇదంతా ఎందుకు చేసిందంటే.. అనసూయ తన ఇంట్లో వటసావిత్రి పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇప్పటివరకు అనసూయను అలాంటి డ్రెస్సులో చూడని అభిమానులు తాజా ఫోటోలను చూసి షాకవుతున్నారు. అంతేకాక, పూజ అయిన తర్వాత తన భర్త భరద్వాజ్ కాళ్లకు మొక్కి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.