వివాదాస్పద టీవీ వ్యాఖ్యాత అర్ణబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ముంబై ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అయిన అర్ణబ్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని శివసేన ప్రభుత్వాలకు మధ్య గొడవల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు.
దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అర్ణబ్ భావజాలం ఏదైనాసరే, అతని వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడం సరికాదని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సుప్రీం కోర్టు పేర్కొంది. రూ. 50 వేల పూచీకత్తుపై ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ముంబై పోలీసులకు స్పష్టం చేసింది. ఆర్ణబ్, మరో వ్యక్తి తనకు బాకీ ఉన్నారని, చెల్లించకపోవడంతో మనస్తానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నామని అన్వయ్ నాయక్ అనే డిజైనర్ సూసైడ్ నోట్ రాసి తన తల్లితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అర్ణబ్ పాత్రపై ఆధారాల్లేంటూ ముంబై పోలీసులు 2018లో కేసు మూసేశారు. శివసేన, బీజేపీ తదాలలో మళ్లీ బయటికి తీసి అరెస్ట్ చేశారు.