anchor ashu reddy lost her job for pawan kalyan
mictv telugu

పవన్ కళ్యాణ్ కారణంగా.. అషురెడ్డి సర్వనాశనం అయిపోయిందా ?

January 6, 2023

ఎన్నారై ట్యాగ్ తో ఇండియాలోకి అడుగుపెట్టిన బ్యూటీ ఆశు రెడ్డి.. క్యూట్ లుక్స్ తో సమంతలా కనిపించడంతో అందరూ జూనియర్ సమంత అని పిలుచుకుంటారు. యూట్యూబర్ గా రీల్స్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో ఛల్ మోహన్ రంగతో సహా కొన్ని చిత్రాలలో ఆశు హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. అయితే ఆమెకు ఆశించిన అదృష్టం దక్కలేదు. కానీ వివాదాస్పద కామెంట్స్, ఆర్జీవీ ఇంటర్వ్యూస్, అందాల ఆరబోతతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమాని.. లేదులేదు అభిమాని అనటం కంటే భక్తురాలు అని చెప్పొచ్చు. డల్లాస్ లో లక్షల సాలరీ వదులుకొని హైదరాబాద్ కి వచ్చేసింది అషురెడ్డి. అయితే అమెరికాలో అషురెడ్డి ఉద్యోగం పోవడానికి.. ఆమె ప్రొఫెషన్ నాశనం అవ్వడానికి ఒక మెయిల్ కారణమని తెలుస్తుంది. గొప్పగొప్ప చదువులు చదువుకుని విదేశాల్లో సెటిల్ అయినా వారు కూడా పవన్ కళ్యాణ్ ని విపరీతంగా అభిమానిస్తారు. అందరిలానే వారు కూడా పవన్ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆరాటపడతారు. అయితే దీనికోసం ఏం చేయాలి.. ముందుగానే HRకి లీవ్ లెటర్ ఇవ్వాలి.. లేదంటే పద్దతిగా బ్రతిమిలాడుకుని షో చూసి వచ్చి ఆఫీస్ వర్క్ చేసుకోవాలి.

కానీ అషురెడ్డి మాత్రం పవన్ మాయలో పడి ఏకంగా ఉద్యోగమే ఊడిపోయేలా చేసుకుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రూఫ్స్ తో సహా చెప్పి షాక్ ఇచ్చింది. 2017వ సంవత్సరంలో కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా.. అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది ఈ ఆర్జీవీ గర్ల్. ప్రీమియర్ షోకి సెలవు కావాలని పంపిన మెయిల్ కారణంగా ఉద్యోగం ఊడిందని చెప్పుకొచ్చింది.ఈ విషయాన్ని మామూలుగా చెప్తే నమ్మరని.. అప్పటి మెయిల్ స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. ఇంతకే ఆ మెయిల్ లో ఏముందంటే.. ‘మంగళవారం నాడు నేను ఆఫీస్ కి రావచ్చు, రాకపోవచ్చు. రావాలని లేదు. ఎందుకంటే ఆరోజు పవర్ స్టార్ సినిమా విడుదల ఉంది. ప్రీమియర్ షో చూడకపోతే నాకది సిగ్గు చేటు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు అర్థం చేసుకోకపోతే నా ఉద్యోగం వేరొకరికి ఇచ్చినా పర్లేదు. కానీ మీరు నన్ను వదులుకోరని అనుకుంటున్నా, పని భారం ఎక్కువ కాబట్టి. కృతజ్ఞతలు అశ్విని రెడ్డి’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టుపై నెటిజన్స్ కొందరు మండిపడుతున్నారు. అదృష్టవశాత్తు అషురెడ్డి యాంకర్ అయ్యి సెటిల్ అయింది. ఒక హీరో మోజులో ఇలా మంచి ఉద్యోగాన్ని వదిలేసుకోవటం కరెక్ట్ కాదని అంటున్నారు. మన వెనుక ఒక కుటుంబం ఉంటుందని మర్చిపోవద్దని.. కుటుంబం కంటే ఎవరు ఎక్కువకాదని.. అషురెడ్డిలా ఇంకెవ్వరు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని కామెంట్స్ చేస్తున్నారు.