anchor lasya blessed with a baby boy
mictv telugu

యాంకర్ లాస్యకు పండంటి కొడుకు

March 8, 2023

anchor lasya blessed with a  baby boy

ఒకప్పటి బుల్లితెర యాంకర్ ఇప్పటి ట్రెండింగ్ యూట్యూబర్ లాస్య ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుసు. రీసెంట్‏గానే బుల్లితెర సెలబ్రిటీలతో కలిసి సంబరంగా సీమంతాన్ని జరుపుకుంది లాస్య. తాజాగా లాస్య ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‏స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. రంగుల పండుగ రోజు బిడ్డ పుట్టడంతో ఇంటికి కొత్త రంగు వచ్చిందంటూ కుటుంబసభ్యులు సంతోషంలో మునిగిపోయారు. చేతులకు రంగులు పూసుకుని తమకు బాబు పుట్టాడన్న విషయాన్ని లాస్య భర్త మంజునాథ్ ఓ వీడియో ద్వారా తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కపుల్‏కు కంగ్రాట్స్ చేబుతున్నారు.

చీమ ఏనుగు జోక్స్‏తో లాస్య బుల్లితెరపైన తనకంటూ క్రేజ్‏ను సంపాదించుకుంది. టీవీలో పలు షోలకు యాంకర్‏గాను వ్యవహరించింది లాస్య. తాను ప్రేమించిన మంజునాథ్‏ను లవ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యింది లాస్య. పెళ్లి తరువాత కెరీర్‏కు బ్రేక్ చెప్పినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‏గా ఉంటుంది. యూట్యూబ్, ట్విటర్లలో వీడియోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటుంది లాస్య. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‏‏డేట్స్ ను అందిస్తుంటుంది. తాజా తనకు బాబు పుట్టాడన్న విషయాన్ని ఇన్‏స్టా వేదికగా ఫ్యాన్స్‏తో పంచుకుంది.