విశ్వక్ అంటే గెటవుట్.. అనసూయ అంటే ఫైటరా? - MicTv.in - Telugu News
mictv telugu

విశ్వక్ అంటే గెటవుట్.. అనసూయ అంటే ఫైటరా?

May 5, 2022

టీవీ యాంకర్ దేవీ నాగవల్లి, సినిమా హీరో విశ్వక్ సేన్‌ల మధ్య ఓ బూతు పదం వల్ల రచ్చ రచ్చ అయిన విషయం మనకు తెలిసిందే. అలాంటి పదాలు ఎలా మాట్లాడతారు? అని కొందరు విశ్వక్‌ను విమర్శించారు. అయితే కొందరు నెటిజన్లు తాజాగా అదే యాంకర్ దేవీతో మరో యాంకర్ అనసూయ మాట్లాడిన వీడియోను బయటకు తీశారు. అర్జున్ రెడ్డి సినిమా టైంలో అనసూయ టీవీ స్టూడియోలో దేవీ నాగవల్లితో మాట్లాడుతూ విశ్వక్ చెప్పిన పదాన్నే చెప్పారు. అప్పుడు నాగవల్లి ఆమెను ఫైటర్ అనసూయ అంటూ సంబోధించారు. దీంతో నెటిజన్లు పలువురు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇదేం న్యాయం? అని ప్రశ్నిస్తున్నారు. విశ్వక్ మాట్లాడితే బూతులా అనిపించి, అనసూయ మాట్లాడితే మంచిగా అనిపించిందా? అంటూ నిలదీస్తున్నారు.