విశ్వక్‌సేన్‌పై మంత్రికి నాగవల్లి ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

విశ్వక్‌సేన్‌పై మంత్రికి నాగవల్లి ఫిర్యాదు

May 3, 2022

సినిమా ప్రమోషన్ల కోసం ప్రాంక్ వీడియో చేస్తూ హీరో విశ్వక్ సేన్‌ అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓ టీవీ చానెల్‌లో డిబేట్ సందర్భంగా యాంకర్ దేవీ నాగవల్లి,  విశ్వక్ తిట్టుకున్నారు. ఆమె గెటవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ విశ్వక్‌ను బయటికి పొమ్మన్నారు.  అంతటితో ఊరుకోకుండా ఈ రోజు నాగవల్లి విశ్వక్ సేన్‌పై జర్నలిస్టు ఫోరం సభ్యులతో కలిసి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ.. ‘సినిమా ప్రమోషన్ గురించి తగిన అనుమతులు తీసుకోవాలి. ప్రాంక్ వీడియోల పేరిట జనాలను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. దీనిపై అధికారులతో మాట్లాడుతా. టీవీలో హీరో ప్రవర్తన మంచిది కాదు. యాంకర్ ఒక రకంగా మాట్లాడుతుంటే హీరో మరో రకంగా మాట్లాడారు. ఓ ఆడ కూతురిని ఈ రకంగా అవమానించడం సబబు కాదు. పైగా చాలా సరదాగా తీసుకుంటూ పైపైన క్షమాపణలు చెప్పడం అంగీకారయోగ్యం కాదు. ఈ అంశాన్ని మా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. పోలీసు అధికారులు, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడతాను’ అని మంత్రి వెల్లడించారు.