తెలుగు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నాడా.. ఎప్పటి నుండో సోషల్ మీడియాలో వింటూ వస్తున్న ఈ రూమర్ ఈ సారి నిజం కానుందా.. అంటే అవుననే అంటున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి స్టైలింగ్ చేసే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్యకి మాచిరాజు మూడు ముళ్ళు వేయబోతున్నాడని ఇంగ్లీష్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఎంతో కొంత నిజం ఉంటే కానీ ఇంగ్లీష్ మీడియా వార్తలు రాయాదని.. ఈ సారి ప్రదీప్ పెళ్లి పక్క అంటున్నారు. ప్రదీప్ కి నవ్య చిరకాల స్నేహితురాలు. ఆమె పూర్తిపేరు నవ్య మరౌతు. ఈ ఇద్దరు సెలబ్రిటీలు చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని కూడా సమాచారం.
నవ్య చాలా కాలంగా ప్రదీప్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోందని, అలాగే తెలుగు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కోసం కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో కూడా నవ్య పేరు తెచ్చుకుందట. ఇక ప్రదీప్, నవ్యలు ఒకే కులానికి చెందినవారు కానప్పటికీ.. వారి పేరెంట్స్ పెళ్ళికి ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పెళ్లి రూమర్స్ నిజం కాదని.. వారు మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య అంతకు మించి ఏమీ లేదని కూడా ప్రదీప్ క్లోజ్ సర్కిల్స్ చెప్తున్న మాట. యాంకరింగ్‌లో ప్రదీప్ స్టైల్‌కు తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. RJ నుండి యాంకర్‌గా మారి హీరోగానూ చేశాడు ప్రదీప్ మాచిరాజు. ఇక ఇంతకుముందు తన స్వయంవరం షో విజేతను వివాహం చేసుకుంటాడని చెప్పినా.. పెళ్లి చేసుకోకపోవటంపై షో పోటీదారుల్లో ఒకరు ప్రదీప్ పై అప్పట్లో పోలీసు ఫిర్యాదు కూడా చేశారు.
ఇవి కూడా చదవండి :
ఆర్ఆర్ఆర్ కి షాక్.. బుక్ మై షో బెస్ట్ ఇండియన్ మూవీస్
బిగ్ బాస్ ఫినాలే నుంచి నేరుగా కళ్యాణ మండపానికి
ఫ్లైట్ నుంచి దూకుతూ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన స్టార్ హీరో