సంక్రాంతి పండగ అంటేనే సరదాలు, సంబరాలు. సంక్రాంతి అంటే కోడి పందేలు, ఎడ్ల పందేలు.ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతాయి. కోడిపందేలు అనేవి సంక్రాంతి సంబురాల్లో భాగం. అయితే, ఇది జూదంగా మారిందని ప్రభుత్వం కోడిపందేలపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ కోడిపందేలు జరుగుతూనే ఉంటాయి.
కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టి ఆడే ఈ క్రీడను చాలా మంది వ్యతిరేకిస్తారు కూడా. అలాంటి వారిలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. సాధారణంగా రష్మి గౌతమ్ ట్విట్టర్లో ఎప్పుడూ మూగజీవాల గురించే చర్చిస్తూ ఉంటుంది. కోవిడ్ టైమ్ లో కుక్కలకు ఫుడ్ పెడుతూ పోస్ట్ లు కూడా పెట్టింది. మూగజీవాలకు హాని కలిగించొద్దని కోరుతుంటుంది. ఎవరైనా మూగజీవాల హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళతో వాదన వేసుకుంటుంది. ఇప్పుడు కోడిపందేల విషయంలోనూ అదే జరిగింది. తన వాదనను వ్యతిరేకించి ఒక నెటిజన్‌పై రష్మి ఫైర్ అయ్యారు.
Sad to see people taking pride in such bullshit
Having a harmless festival doesn't take much pic.twitter.com/scoLzi44Sk— rashmi gautam (@rashmigautam27) January 15, 2023
కోడిపందేల్లో పాల్గొన్న ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. తాను రెండు పందేల్లో గెలిచానని.. పందేలు చాలా బాగా జరిగాయని.. తాను ఎంతో ఎంజాయ్ చేశానని పోస్ట్‌లో ఆ డాక్టర్ పేర్కొన్నారు. అయితే, ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీని యాంకర్ రష్మి స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశారు. అంతేకాదు, ఆ స్క్రీన్ షాట్ మీద ‘‘డాక్టర్ డిగ్రీని మురికి గుంటలో వేసి డాక్టర్ వెంకీ హింసను ప్రేరేపిస్తున్నారు’’ అని రాశారు. ‘‘ఇలాంటి చెత్తపనులు చేయడాన్ని జనాలు గర్వంగా భావించడం బాధగా ఉంది. హింసలేకుండా ఒక పండుగను జరుపుకోవడం అంతగొప్పగా అనిపించదు’’ అని ట్వీట్లో రష్మి రాసుకొచ్చింది.
How do u know Kodi ki badha ledu anni
Why dont you do human fights
Fight until death
Gladiator flights were part of culture too. Maybe we shud adapt tat and pitch humans to fight until death https://t.co/O8rbqKAMo7— rashmi gautam (@rashmigautam27) January 16, 2023
అయితే, రష్మి వాదనను చాలా మంది నెటిజన్లు వ్యతిరేకించారు. ఒక నెటిజన్ అయితే.. ‘‘ఇది గర్వం కాదు మా సంప్రదాయం. కోడికి లేని బాధ మీకు ఎందుకు మేడమ్’’ అని కాస్త ఘాటుగా కామెంట్ చేశారు. ఈ కామెంట్‌కు రష్మి కూడా స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది. ‘‘కోడికి బాధ లేదు అని మీకు ఎలా తెలుసు? మీరు ఎందుకు మనుషుల ఫైట్లు ఎందుకు పెట్టడం లేదు.. అదే, చనిపోయేంత వరకు ఫైట్. గ్లాడియేటర్ పోరాటాలు కూడా సంప్రదాయంలో భాగమే. బహుశా మనం దాన్ని స్వీకరించి, చనిపోయేంత వరకు ఫైట్ చేయడానికి మనుషులను దించాలి’’ అని కోడికి, మనిషికి ముడిపెట్టి గట్టి కౌంటర్ ఇచ్చింది.
How do u know Kodi ki badha ledu anni
Why dont you do human fights
Fight until death
Gladiator flights were part of culture too. Maybe we shud adapt tat and pitch humans to fight until death https://t.co/O8rbqKAMo7— rashmi gautam (@rashmigautam27) January 16, 2023
రష్మి కౌంటర్‌కు రీ-కౌంటర్ ఇచ్చారు సదరు నెటిజన్. ‘‘యూఎఫ్‌సీ రెజ్లింగ్, బాక్సింగ్, కబడ్డీ క్రీడల్లో మనషులు ఎంతో నిబద్ధతో పాల్గొంటారు. తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా గేమ్ మీదే ఫోకస్ పెడతారు. దేశం గర్వపడేలా చేస్తారు. జైహింద్’’ అని సదరు నెటిజన్ రిప్లై ఇచ్చారు.
Ufc wrestling boxing kabaddi this are also games with full of their deep attention on that they are not fear about their lives they focus on their games and taken pride to our nation Jai hind @rashmigautam27
— Nani Nani (@NaniNan78671508) January 16, 2023