యాంకర్ రవి కారుకు ప్రమాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

యాంకర్ రవి కారుకు ప్రమాదం..

December 9, 2019

Anchor ravi.

ప్రముఖ బుల్లితెర యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. కారు కొద్దిగా ధ్వంసమైంది.  శనివారం ఉదయం హైదరాబాద్‌ మూసాపేట నుంచి బంజార్‌ హిల్స్‌ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మీ కళా, శశికళా థియేటర్స్‌ ఎదురుగా భరత్‌ నగర్‌ వంతెన ఎక్కుతుండగా ఓ డీసీఎం వ్యాన్‌, రవి కారును వెనుకనుంచి వచ్చి ఢీ కొట్టింది. 

ఆ సమయంలో కారులో రవితో పాటు కారు డ్రైవర్‌ ఉన్నాడు. డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేయగా అతను బాగా తాగి ఉన్నడని రవి తెలిపాడు. రవి పోలీసులకు ఫోన్‌ చేయగా..వాళ్ళు వచ్చే లోపు ఆ డ్రైవర్‌, క్లీనర్‌ డీసీఎంను అక్కడే వదిలేసి పారిపోయారు. రవి డీసీఎం డ్రైవర్‌పై సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కింద వారి మీద కేసు రిజిస్టర్‌ చేసినట్టుగా తెలిపాడు. అయితే ట్రాన్స్‌పోర్ట్ ఓనర్‌ తనను సంప్రదించాడని.. తాను జరిగిన నష్టాన్ని భరిస్తానన్నాడని రవి తెలిపాడు. ఈ ప్రమాదానికి సంబందించిన వివరాలను రవి ఓ వీడియోలో తెలిపాడు.