మహర్షి సక్సెస్ మీట్.. యాంకర్ హేమంత్ కారు బోల్తా - MicTv.in - Telugu News
mictv telugu

మహర్షి సక్సెస్ మీట్.. యాంకర్ హేమంత్ కారు బోల్తా

May 19, 2019

Anchor, Rj Hemanth Car Accident At Vijayawada, Jaggayyapeta.

ప్రముఖ యాంకర్, నటుడు ఆర్జే హేమంత్ కారు బోల్తా పడింది. ఆదివారం హేమంత్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న హేమంత్.. జగ్గయ్యపేట సమీపంలోని షేర్‌మహ్మద్‌పేట క్రాసింగ్ వద్దకు రాగనే కారుకు అడ్డంగా గేదే అడ్డొచింది. దాన్ని తప్పించబోయిన హేమంత్ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్ కు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో హేమంతే కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది.

కాగా శనివారం రాత్రి విజయవాడలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హేమంత్.. తిరిగి ఆదివారం ఉదయం హైదరాబాద్ బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హేమంత్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.