anchor sameera breast feeding to her son in flight
mictv telugu

ఫ్లైట్‌లో బిడ్డకి పాలిస్తూ.. యాంకర్ సమీరా వీడియో వైరల్..!

January 5, 2023

జీవితానికి సంపూర్ణత ఇచ్చే మాతృత్వం అంటే ప్రతి స్త్రీకి ఒక మధురమైన అనుభూతి. అమ్మాయిలకి మాతృత్వాన్ని మించిన వరం మరొకటి ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చిన మహిళ అయినా.. గర్భం దాల్చగానే తల్లి పాత్రలో ఒదిగిపోతుంది ఇక గర్భం దాల్చి బిడ్డని కన్నాకా.. ఎదిగే బిడ్డను పొత్తికడుపుల్లో పడుకోబెట్టుకుని పాలు ఇస్తు ప్రతి తల్లి పొందే ఆనందం వర్ణనాతీతం. అయితే బిడ్డలు పుట్టాకా తల్లులకు ఎదురయ్యే ప్రధాన సమస్య పబ్లిక్ ప్లేసుల్లో పాలు ఇవ్వటం. బిడ్డ ఆకలితో ఏడుస్తున్నా.. పబ్లిక్ ప్లేస్ కావటంతో పాలు ఇవ్వడానికి ఆలోచించే అమ్మలకి స్పూర్తినిస్తూ తాజాగా తెలుగు యాంకర్ సమీరా షెరీఫ్ పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

యాంకర్ సమీరా షెరీఫ్ తాజాగా పబ్లిక్ ప్లేస్ లోనూ కంఫర్టబుల్ గా తన కొడుక్కి పాలిస్తున్న వీడియోను షేర్ చేసింది. అదీకాక ఫ్లైట్ లో కూడా సౌకర్యవంతగా కొడుక్కి పాలిచ్చింది ఈ యాంకర్. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమీరా. తన అత్త, ప్రముఖ నటి సనతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ తన ఫాలోవర్స్‌కి అందుబాటులో ఉండే సమీరా తాను ధరించిన వస్త్రాలు.. చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని.. బిడ్డకి హాయిగా పాలిస్తున్నానని చెప్తూ వీడియోను షేర్ చేసింది. ఇక లు సీరియల్స్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంది సమీరా.