శ్యామలను ఆంటీ అన్న సీనియర్ నటుడు.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్యామలను ఆంటీ అన్న సీనియర్ నటుడు..

November 3, 2022

సీనియర్ నటుడు రాజా రవీంద్రకు టాలీవుడ్‌లో మంచి పేరుంది. ఏ రోల్ చేసినా న్యాయం చేస్తాడు. ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటిస్తాడు. తాజాగా ఆయన ‘తగ్గేదే లే’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. యాంకర్ శ్యామలను ఆంటీ అంటూ రాజా రవీంద్ర కామెడీగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఇచ్చిన కౌంటర్‏కు నాలుక కరుచుకున్నాడు.

‘ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి గారు మంచి చిత్రాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. బాహుబలి వంటి పది సినిమాలను తీయగల సత్తా ఉంది. కానీ మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనాలో కష్టపడి పని చేశాం. అందరికీ వ్యాక్సినేషన్ చేయించి సొంత మనుషుల్లా చూసుకున్నారు. అని మాట్లాడుతూ.. చివర్లో శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అంటూ రాజారవీంద్ర ప్రసంగాన్ని ముగించారు. దీంతో తనను ఆంటీ అనడంపై సీరియస్ కాకుండా తెలివిగా సెటైర్ వేసింది శ్యామల. అబ్బా..హా.. అర్రె.. నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. దీంతో శ్యామల సమాధానానికి రాజా రవీంద్ర షాకయ్యారు.