anchor sreemukhi reacts to marriage news
mictv telugu

సిగ్గులేదా.. సొంత తండ్రితో సంబంధం అంటగడతారా ?

January 8, 2023

anchor sreemukhi reacts to marriage news

సోషల్ మీడియా కారణంగా లాభాలు చాలానే ఉన్నా.. నష్టాలూ తీవ్రంగానే ఉంటాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల విషయంలో కాస్త హద్దులు దాటుతూ ఉంటాయి. పర్సనల్ మ్యాటర్స్ లో అతిగా ఇన్వాల్వ్ అయ్యి స్టార్స్ కి చికాగు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్స్ డేటింగ్ చేస్తున్నారని.. త్వరలో పెళ్ళ చేసుకోనున్నారని పుకార్లని రాస్తుంటారు. కొందరు వీటిని లైట్ తీసుకుంటే.. కొంతమంది రియాక్ట్ అవుతుంటారు. అయితే యాంకర్ శ్రీముఖి తాజాగా తనపై వస్తున్న దారుణమైన రూమర్స్ పై స్పందించింది. శ్రీముఖి పెద్ద బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉందని.. త్వరలో వీరిద్దరి పెళ్లి అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు శ్రీముఖి పెళ్లి గాసిప్స్ పై పెదవి విప్పింది. రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై మండిపడింది.

మరీ ఇంత ఘోరమా?.. కొంచమైనా సిగ్గులేదా.. సొంత తండ్రితో సంబంధం అంటగడుతున్నారని ఫైర్ అయింది శ్రీముఖి. మరో నాలుగేళ్లు నా పెళ్లి ఉండదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉందని స్పష్టం చేసింది. ‘నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఇంకా మూడు, నాలుగేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా. అప్పుడు కూడా నేనే స్వయంగా ప్రకటిస్తాను. ఇప్పుడు మాత్రం నాకు పెళ్లి ఆలోచన లేదు. దయచేసి ఇలాంటి వార్తలను స్ప్రెడ్‌ చేయద్దు’ గాసిప్‌ రాయుళ్లకు రిక్వెస్ట్ చేసింది శ్రీముఖి. ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోందీ స్టార్‌ యాంకర్‌. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళాశంకర్‌ సినిమాలో శ్రీముఖి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.