Anchor Suma Clarity On Anchoring Break
mictv telugu

ఎర్రి వెధవలని చేసి.. ఏం తేలినట్టు నటించటం ఏంటక్కా ?

December 28, 2022

trolls on anchor suma new year event promo

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల అంటే అందరికి అభిమానమే. మొదట ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పేరు తెచ్చుకున్న సుమ.. ఆ తరువాత ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, రియాలిటీ షోస్, గేమ్ షోస్, మూవీస్ ఇలా అన్నింటిలో సుమ దూసుకెళ్తుంది. తమ కామెడీ టైమింగే ఆయుధంగా.. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగింటి కోడలిగా సుమ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రతి ఛానెల్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సుమ తాజాగా చేసిన ఈవెంట్ ప్రోమో ఒకటి తెగ విమర్శల పాలవుతుంది. డిసెంబర్ 31న ఈటీవీలో ప్రసారం కానున్న ‘వేర్ ఈజ్ ది పార్టీ’ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలో సుమ మాట్లాడుతూ.. తాను కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకుంటున్నానని కంటతడి పెట్టింది. దీంతో ఆమె యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చేస్తున్నారంటూ వార్తలు రాగ.. సుమకి విపరీతమైన కాల్స్ వచ్చాయట. పెద్ద ఎత్తున స్నేహితులు, సన్నిహితులు ఫోన్లు చేయడం మొదలుపెట్టారట.

దీంతో సుమ రంగంలోకి దిగి మీడియాలో వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఒక వీడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు సుమ. తానెక్కడికి వెళ్లట్లేదని, ఈ లైఫ్ అంతా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని.. అందరి ప్రేమకు థ్యాంక్స్ అని రాసుకొచ్చింది. ఇంకేముంది.. ప్రోమోలో చూసిందంతా ప్రాంక్ అని, పబ్లిక్ స్టంట్ అని అర్థమవ్వడంతో.. ఇలాంటి ప్రోమోలతో పాటు సుమపై కూడా విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. అసలు ఆ ప్రోమోలో నిజంగానే వెళ్లిపోతున్నా అన్నట్లుగా ఏడవడం ఎందుకు? అదంతా ఉత్తుత్తే.. అసలు మ్యాటర్ ఏంటో క్లైమాక్స్ లో తెలుస్తుంది అని చెప్పడం ఎందుకని కడిగేస్తున్నారు. దశాబ్ద కాలంగా యాంకరింగ్ చేస్తున్న సుమకి బ్రేక్ అవసరమని ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ నిజంగానే భావించారు పాపం. ప్రోమోలో సుమ కన్నీళ్లు నిజమే అనుకుని.. ‘సుమక్క ఏడవొద్దు.. మీరు కొద్దీ రోజులు రెస్ట్ తీసుకొని రండి మేము మళ్ళీ సపోర్ట్ చేస్తాం’ అంటూ కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు వాళ్లంతా వెర్రి వెంగళప్పయ్యారని.. డబ్బుల కోసం అభిమానులని అలా ఫూల్స్ చేయటం పద్ధతి కాదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి : 

మరో వివాదంలో రష్మిక.. సౌత్ ఇండస్ట్రీపై వెగటు కామెంట్స్

రాధిక నుంచి నాగలక్ష్మి వరకు….