బుల్లితెరపై ఎవర్గ్రీన్ , మోస్ట్ ఫేవరేట్ యాంకర్ ఎవరని అడిగితే వచ్చే ఒకే ఒక్క ఆన్సర్ సుమ కనకాల. తన వాక్చాతుర్యంతో, సున్నితమైన హాస్యంతో తెలుగు సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సుమ.. ఇప్పుడు వెండితెరపై తానేంటో చూపిద్దామని వస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది మూవీ యూనిట్. సినిమాలో మెయిన్ లీడ్లో నటించిన సుమ.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమెకు.. పరోక్షంగా చాలామంది యాంకర్ల పొట్టకొడుతున్నారే అనే విమర్శ ఎదురైంది. అందుకు సుమ తనదైన స్టైల్లో స్పందించింది. తాను మరొకరి పొట్టకొట్టలేదని, ఎవరినీ తొక్కేయలేదని సూటిగా సమాధానమిచ్చిందిద. నేను నాకు వచ్చే ఈవెంట్లు తగ్గించుకుంటే నా ఈ ఎమ్ ఐలు మీరు కడతారా? నా పిల్లల ఫీజులు మీరు కడతారా? లేదుకదా? మరి అలాంటప్పుడు నా కష్టమేదో నేను పడాలిగదా? యాంకర్స్ అంతా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఎవరి టాలెంట్ వారికి ఉంది .. ఎవరి స్టైల్ వారికి ఉంది. ఎవరికి రావలసిన అవకాశాలు వాళ్లకి వస్తుంటాయి. వాళ్లందరి స్టైల్ ను నేను లైక్ చేస్తుంటాను” అని స్పష్టం చేసింది.