Anchor Suma Goodbye To Anchoring profession
mictv telugu

యాంకరింగ్ కి సుమ గుడ్ బై ?

December 27, 2022

suma goodbye to anchoring profession

తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్ ఎవరంటే మరో మాట లేకుండా చెప్పే పేరు సుమ కనకాల. ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, రియాలిటీ షోస్, ఇంటర్వ్యూస్.. ఇలా వేదిక ఏదైనా సుమ ఉండాల్సిందే. స్టార్ హీరోలు, స్టార్ దర్శకుల మొదటి ఛాయిస్ సుమనే. సీరియల్స్ నుండి నటిగా మారి ఆ తరువాత స్టార్ యాంకర్ గా తెలుగు వాళ్ళని దశాబ్దం పైపడి నవ్విస్తున్న సుమ పంచులకి సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది.

వ్యతకారానికి కేర్ ఆఫ్ అయిన ఆలీ, బ్రహ్మాజీ వంటి వారిని కూడా ఒక ఆడుకుంటుంది సుమ. చిరంజీవి, రాజమౌళి వంటి వారికైతే సుమ లక్కీ యాంకర్ అంటారు. బాలీవుడ్ టు టాలీవుడ్ ఏ సెలబ్రెటీ తమ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినా సుమ డేట్స్ కావాల్సిందే. ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూకి 3లక్షలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 10లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సుమపై ప్రచారం ఉంది. అలాంటి స్టార్ యాంకర్ సుమ ఇప్పుడు ఒక షాకింగ్ డెసిష‌న్‌ తీసుకుంది.

తాజాగా ఓ టీవీ ఛానల్ లో న్యూ ఇయర్ కి టెలికాస్ట్ కానున్న స్పెషల్ ప్రోగ్రాంలో సుమ పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను యాంకరింగ్ కి బ్రేక్ ఇస్తున్నాను అంటూ బాంబు పేల్చింది. ఒక ప్రోగ్రాం ప్రోమో విడుదల సందర్భంగా ఆర్టిస్టులంతా సుమకి సన్మానం చేశారు. ఈ సన్మానంలో సుమ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ‘మళయాళీగా పుట్టిన నేను తెలుగులో ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి తెలుగు ప్రజలే కారణం.

కానీ ప్రస్తుతానికి నేను కొంత విరామం తీసుకుంటున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుమ. ప్రస్తుతం ఈ ప్రొమో వీడియో వైరల్ గా మారింది. అయితే గత కొద్దిరోజులుగా సుమ వైవాహిక జీవితంపై రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుమ యాంకరింగ్ వదిలేయటం చర్చనీయాంశం అవుతుంది. సుమ యాంకరింగ్ కి ఎందుకు బ్రేక్ ఇస్తుంది.. కారణాలు ఏంటని ప్రేక్షకులు పలు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే వీటికన్నింటికీ డిసెంబర్ 31కి టెలికాస్ట్ కానున్న షోలో సుమనే సమాధానం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి : 

పవన్ – బాలయ్యల సెట్స్ లో సెక్యూరిటీ లోపం.. భారీ గందరగోళం ?

సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో షారూఖ్ ఖాన్ సందడి..వీడియో వైరల్

భగభగ మండే వాల్తేరు వీరయ్య.. టైటిల్ సాంగ్ వచ్చేసింది