మేం విడాకులు తీసుకోవడం సులభమే.. కానీ తర్వాత : యాంకర్ సుమ - MicTv.in - Telugu News
mictv telugu

మేం విడాకులు తీసుకోవడం సులభమే.. కానీ తర్వాత : యాంకర్ సుమ

April 26, 2022

మాటల మహారాణి, ప్రముఖ తెలుగు యాంకర్ సుమ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. ఆమె తాజాగా నటించిన ‘జయమ్మ పంచాయితీ’ ప్రమోషన్లలో భాగంగా ఓ షోలో పాల్గొన్న సుమ.. తన భర్తతో జరిగిన గొడవల గురించి వివరించింది. మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల వరకు వెళ్లిందంట నిజమా? అని అడిగిన ప్రశ్నకు సుమ భావోద్వేగానికి గురైంది. అనంతరం తేరుకొని ‘భార్యా భర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే. 23 ఏళ్ల వివాహ జీవితంలో ఎన్నో గొడవలు జరిగాయి. కానీ, ఇద్దరు పిల్లల తల్లిదండ్రులుగా విడాకులు కోరడం అనేది వెరీ డిఫికల్ట్’ అని సమాధానమిచ్చింది. ఇక సినిమాల్లో నటించమని తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయనీ, కానీ, మంచి సినిమా చేద్దామని ఇంతకాలం ఆగినట్టు తెలిపింది. తన కొడుకు త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని, చిన్నప్పటి నుంచే అతనికి హీరో లక్షణాలున్నాయిని వెల్లడించింది.