ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన స్టార్ యాంకర్ ఉదయభాను. కొన్ని కుటుంబ సమస్యలతో ఉదయభాను యాంకరింగ్ కి దూరమైన గ్యాప్ లో సుమ ఎంట్రీ ఇచ్చింది. లేదంటే ఇప్పటికీ ఉదయభానే స్టార్ యాంకర్ గా ఉండేదేమో. బుల్లితెరలో తొలిసారి అవుట్ డోర్ షూట్స్, భారీ ఈవెంట్స్, గేమ్ షోస్, డ్యాన్స్ షోస్ వంటి సరికొత్త ప్రోగ్రామ్స్ కి శ్రీకారం చుట్టింది తొలుత భానునే. అయితే ఈమెకి సినిమాల్లోనూ అప్పట్లో భారి క్రేజ్ ఉండేది. దాసరి నారాయణరావు, శేఖర్ కమ్ముల వంటి అగ్ర దర్శకుల చిత్రాల్లో నటించిన చరిత్ర ఈమెకుంది. అయితే సినిమాల్లో కథానాయికగా అంతగా రాణించకున్నా.. ఐటం సాంగ్స్, స్పెషల్ రోల్స్ లో ఉదయభాను మెరిసేది. ఇక వివాహానంతరం ఇద్దరు కవలలను చూసుకుంటూ ప్రస్తుతం కాస్త సైలెంట్ అయింది. కానీ సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూనే ఉంటుంది ఉదయభాను. అలాంటి ఉదయభాను తాజాగా ఒక రీల్ వీడియోను రూపొందిస్తే.. ఆ వీడియోకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
View this post on Instagram
ఉదయభాను షేర్ చేసిన వీడియోలో జనసేన గుర్తును ప్రచారం చేసినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఈ వీడియోను రూపొందించినట్లు స్పష్టమవుతుంది. ఆమె గాజు గ్లాస్ ను చూపుతున్నఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో జనసేనకు మద్దత్తుగా నిలిచిందని ఉదయభానుపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఉదయభాను తన ఇన్‌స్టా్గ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన ఈ వీడియోలో.. ‘గ్లాస్లో చాయ్ తాగితె ఆ కిక్కే వేరబ్బ..’ అంటూ ఆమె వీడియోను పోస్టు చేశారు. అయితే ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా టైటిల్ సాంగ్ కూడా ప్లే అవుతుండటం గమనార్హం. దీనికి తోడు ఉదయభాను #powerstar #glass #pk #pawanism #pawankalyan యాష్ ట్యాగులను కూడా జత చేశారు. దాంతో జనసేనకు మద్దతుగా పోస్టు చేశారంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయభానుకు థాంక్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ ఉదయభాను.. జనసేన పార్టీలో చేరతారా? లేకపోతే ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందా? అనే చర్చ కూడా మొదలైంది.