తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె.. ఓపెన్ చేసి చూడగా.. - MicTv.in - Telugu News
mictv telugu

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె.. ఓపెన్ చేసి చూడగా..

June 15, 2022

పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో బయటపడిన ఓ పురాతన పెట్టెకు సంబంధించి, సంచలన విషయాలను బయటపెట్టారు. 4 వేల సంవత్సరాలకు చెందిన చారిత్రక నిధిని కనిపెట్టినట్లు పేర్కొన్నారు. ఆ పెట్టెలో ఎంతో విలువైన సంపదను ఓ విచిత్రమైన ఆకారంలో గల పెట్టేలో పెట్టి, బలి గుంటలో పాతిపెట్టినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వివరాలను వెల్లడించారు. మరి ఏ దేశంలో ఈ పురాతన పెట్టె దొరికింది? ఆ పెట్టెలో ఏముంది? అనే పూర్తి వివరాల్లోకి వెళ్లే, చైనా దేశపు మీడియా నివేదికల ప్రకారం.. ”పురావస్తు శాస్త్రవేత్తలు తాబేలు షెల్‌ను పోలి ఉండే పెట్టెలో భారీ నిధిని కనుగొన్నారు. ఈ పెట్టెను 6 బలి గుంటలలో పాతిపెట్టారు. ఆ పెట్టేలో బంగారం, కంచు, పచ్చతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి” అని వివరాలు వెల్లడించింది.

 

నిజానికి ఈ సంస్కృతికి లిఖిత పూర్వకమైన చరిత్ర లేదు. ఈ నిధి కనుగొనబడిన శాంక్సింగ్ డుయ్ శిధిలాలు సిచువాన్ ప్రావిన్స్ ఉన్నాయి. 1920ల చివరలో శాంక్సింగ్ డుయ్ శిథిలాలు బయటపడ్డాయి. ఇది 20వ శతాబ్దపు ప్రపంచంలోని గొప్ప పురావస్తు ఆవిష్కరణలలో ఒకటిగా పరిగణించబడుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఇది 12 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని 3000-4500 సంవత్సరాల నాటి షు సామ్రాజ్యం అవశేషంగా భావిస్తున్నారు. ఈ తవ్వకాల్లో బూడిద కందకాలు, నిర్మాణ పునాదులు, చిన్న బలి గుంటలు, సాంస్కృతిక అవశేషాలు, వెదురు, రెల్లు, సోయాబీన్లు, పశువులు, అడవి పందుల అవశేషాలను కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.