ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా శతాబ్ధాల కాలం నాటి శ్రీ కృష్ణుడి విగ్రహం బయటపడింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని పొలమూరు వేణుగోపాలస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానికులు భావించారు.
ఈ నేపధ్యంలో పనులను చేస్తున్న సమయంలో శ్రీ కృష్ణుడి విగ్రహం బయల్పడింది. ఆలయ ధ్వజస్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో పునాదిని తవ్వుతుండగా శ్రీ కృష్ణుడి విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహం శతాబ్దాల కాలం నాటిదని తెలుస్తోంది. శ్రీ కృష్ణుడి విగ్రహ విషయం తెలియగానే గ్రామస్థులతో పాటు.. ఇరుగుపొరుగు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. పూజలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.