ఆంధ్రాబ్యాంక్ మాయం..రెండో అతిపెద్ద బ్యాంకుగా PNB   - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రాబ్యాంక్ మాయం..రెండో అతిపెద్ద బ్యాంకుగా PNB  

April 1, 2020

Andhra Bank Merge In Union Bank Of India

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తి అయింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగుకు అతి పెద్ద బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఆంధ్రా బ్యాంకు కూడా విలీనం అయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దీన్ని విలీనం చేశారు. ఇటు పంజాబ్ నేషనల్‌ బ్యాంక్ (PNB )లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసిపోయాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా PNB అవతరించింది.

తాజా విలీనంతో ఆంధ్రా బ్యాంకు చరిత్ర ముగిసినట్టైంది. దాదాపు 97 ఏళ్లుగా  ఈ సంస్థ సేవలంనందించి చివరకు PNBలో విలీనం చేశారు. దీంతో ఇక నుంచి ఆంధ్రాబ్యాంక్‌ లోగోకు బదులు యూనియన్‌ బ్యాంకు లోగో లేదా కొత్త లోగోను ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రా బ్యాంకును స్థాపించారు. 1923 నవంబరులో ఏర్పాటు చేయగా 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 బ్రాంచులు ఏర్పాటు అయ్యాయి.