జగన్ కీలక నిర్ణయం.. వారంలో 26,778 పోస్టులు భర్తీ  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ కీలక నిర్ణయం.. వారంలో 26,778 పోస్టులు భర్తీ 

July 30, 2020

Andhra govt. gives green signal for recruitment of 26,778 medical posts

ఏపీలో రోజురోజుకు కరోనా విలయతాండవం చేస్తుండగా.. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అటు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రికర్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లవేళలా పాటు పడుతోంది. వైద్య రంగంలో నూతన నియామకాలను చేపట్టే దిశలో.. వారం రోజుల్లోగా 26,778 పోస్టులను భర్తీ చేయాలని జగన్ నిర్ణయించారు. ఆగస్టు 5లోగా ఈ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. నేటి (జూలై 30) నుంచి వాక్‌ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమించుకోవాలని సూచించింది.

స్పెషలిస్టు డాక్టర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు ఇలా మొత్తం 26,778 ఉద్యోగాలను నియమించనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన ఆరు నెలల్లో వీరిని నియమిస్తారు. నియామకం పూర్తయిన రోజే విధుల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. కాగా, ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల కల్లా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఎంపికైనవారి వివరాలు పంపాల్సి ఉంటుంది.