ఆంధ్రా ఎంపీ మాధవి ప్రీవెడ్డింగ్ షూట్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రా ఎంపీ మాధవి ప్రీవెడ్డింగ్ షూట్..

October 10, 2019

ఈమధ్య కాలంలో ప్రీవెడ్డింగ్ వీడియో తీసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. పెళ్లిని పదికాలాల పాటు అందంగా దాచుకోవాలని చూసుకుంటున్నారు. ఇందుకు తానేం తీసిపోనని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కూడా తన ప్రీవెడ్డింగ్ వీడియో షూట్ చేయించుకున్నారు. పాతికేళ్ల వయసులోనే పార్లమెంట్‌లో అడుగుపెట్టి ఆమె సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆమె వివాహం ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్‌ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్‌ను పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. 

 

మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో వివాహ వేడుకను అత్యంత కన్నుల పండుగగా జరపనున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్‌ వీడియో షూట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు చేస్తోంది. కాగా, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక​ ఎన్నికల్లో  మాధవి అరకు పార్లమెంట్‌ నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. టీచర్‌గా ప్రస్థానం ప్రారంభించిన మాధవి… ఈ ఎన్నికల్లో కిశోర్‌ చంద్రదేవ్‌ను ఓడించారు. ఇదిలావుండగా ఆమెకు కాబోయే భర్త శివప్రసాద్‌ బి.టెక్‌, ఎంబీఏ పూర్తిచేశారు. గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన ఆయన ప్రస్తుతం కరస్పాండెట్‌గా ఓ కాలేజ్‌ నిర్వహిస్తున్నారు.