ఏం కాదు, నీళ్లు చల్లితే సరిపోద్ది.. విశాఖ గ్యాస్ లీక్‌పై డీజీపీ
కరోనా వైరస్‌ను అడ్డుకోడానికి బ్లీచింగ్ చల్లి, పారాసెటమాల్ వేసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం రేగుతోంది. అది చాలదన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా కొత్త వైద్యం బాట పట్టారు. విశాఖలో లీకైన ప్రమాదకర విషవాయువుకు పీవీసీ గ్యాస్ ను ఆయన తేలిగ్గా తీసుకున్నారు.
‘అదేమంత ప్రమాదకర విషవాయువు కాదు. కొంత దురదపెడుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నీళ్లు చల్లితే సరిపోతుంది.. బాధితులు బాగా నీళ్లు తాగడమే దీనికి విరుగుడు ఆర్ ఆర్ వెంకటాపురంలో మేం నీటిని స్ప్రే చేస్తున్నాం.. లీక్ వల్ల ఆరుగురు చనిపోయారు. ఇద్దరు ఇళ్లపై నుంచి తూలి చనిపోయారు. ఇప్పుడంతా బావుంది. ఫ్యాక్టరీలో లీకేజీ అదుపులోనే ఉంది’ ఆని ఆయన చెప్పుకొచ్చారు. తమకు ఎవరో 100 నంబరుకు పోన్ చేస్తనే విషయం తెలిసిందన్నారు. గ్యాస్ లీక్ వల్ల 8 మంది చనిపోయి, వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే పోలీసు దొర ఇలా తేలిగ్గా కొట్టిపడేయడంపై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క.. బాధితులను పరామర్శించడానికి సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడు వైజాగ్ వస్తున్నారు.